Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!

  • నంద్యాల జిల్లాలో దారుణ హత్య ఘటన
  • ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య
  • మృతుడు డోన్‌కు చెందిన విల్సన్‌గా గుర్తింపు
  • 11 ఏళ్ల క్రితం మేరీ (రాశి)తో వివాహం..
Murder

Murder

Wife Kills Husband: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న కైప సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, మృతుడు డోన్‌కు చెందిన విల్సన్‌ గా గుర్తించారు. ఆ తర్వాత లోతుగా విచారణ జరిపి, ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించారు.

Bolisetti Satyanarayana: బొలిశెట్టికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న జనసేన.. ధన్యవాదాలు తెలిపిన సత్యనారాయణ..

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల క్రితం విల్సన్‌ కు నంద్యాల బొగ్గు లైన్ ప్రాంతానికి చెందిన మేరీ అలియాస్ రాశితో వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా భర్త అనుమానాలు వ్యక్తం చేయడంతో, ఆమె మధు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా మారడంత, అతడిని అడ్డు తొలిగించేందుకు కుట్ర పన్నింది. ఇందుకోసం ప్లాన్ ప్రకారం.. మధు తన స్నేహితులు రఫీ, అశోక్‌ లతో కలిసి విల్సన్‌ ను డోన్ నుంచి నంద్యాలకు ఆటోలో తీసుకువెళ్తూ మధ్యలో కైప సమీపంలో ఆపారు. అక్కడ విల్సన్ మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి పరారయ్యారు.

Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

ఆ తర్వాత చివరికి నిందితులు కైప వీఆర్వో సమక్షంలో లొంగిపోయారు. ఈ కేసులో భార్య మేరీతో పాటు మధు, రఫీ, అశోక్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ దారుణ ఘటనతో మృతుడి 10 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడు అనాథలుగా మారారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.