ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది.? నాగేశ్వరరావు దంపతులను ఎలా ట్రాప్ చేశారు? దంపతుల చేత బలవంతంగా తన ఫామ్‌లో లో ఎందుకు పని చేయించుకున్నాడు.? తక్కువ జీతానికి ఎక్కువ పని ఎందుకు చేయించాడు.? తన ఫామ్ లో పనిచేసిన దంపతులకు పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆరు నెలల క్రితం నాగేశ్వరరావు దంపతుల మధ్య ఏం జరిగింది. దంపతులే నాగేశ్వరావుని టార్గెట్ చేశారా లేక నాగేశ్వరరావుని దంపతుల టార్గెట్ చేశారా. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయా అంశంగా మారింది… ఈ ఎపిసోడ్‌లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితం భర్తకు తెలియకుండా భార్యను తీసుకొని నాగేశ్వరరావు తన ఫామ్ హౌస్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త.. భార్యను చూశాడు. తనకు తెలియకుండా తన భార్యను ఇక్కడ వరకు ఎందుకు తీసుకువచ్చావని నాగేశ్వర్ రావు తో గొడవపడ్డారు. దీంతో.. గత ఆరు నెలల నుంచి నాగేశ్వరరావు మధ్య గొడవలు జరుగుతున్నాయి . దీనికి తోడు తక్కువ జీతం ఇచ్చి పెద్ద మొత్తంలో పని చేయించుకుంటున్న ఆగ్రహం కూడా ఉంది. మరోవైపు తన భార్యను నాగేశ్వరరావు ఏమో చేస్తున్నాడని అనుమానం కూడా భర్తకు ఉంది.
Read Also: Terrible Incident: హైదరాబాద్‌లో దారుణం.. తండ్రిని కొట్టిచంపిన తనయుడు
ఈ నేపథ్యంలోనే నెలరోజుల క్రితం భార్యను భర్త నిలదీశాడు. దీంతో భార్య మొత్తం వ్యవహారాన్ని భర్తకు పూసకొచ్చినట్లు చెప్పింది. తనను మానసికంగా, శారీరకంగా నాగేశ్వరరావు వేధిస్తున్నారని తెలిపింది. అయితే, ఎలాగైనా సరే నాగేశ్వరరావుని ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భర్త ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే భార్య చేత నాగేశ్వరావుకి పదేపదే భర్త ఫోన్లు చేయించినట్లుగా సమాచారం. గత నెల రోజుల నుంచి బాధిత మహిళ, నాగేశ్వరావుకి వాట్సాప్ కాల్స్ చేస్తూనే ఉన్నట్లుగా సమాచారం. 15 రోజులు క్రితం నాగేశ్వరరావు బాధిత మహిళ వద్దకు రావడం జరిగింది. అయితే, అదే సమయంలో భర్త భార్యలు ఇద్దరు కలిసి ఉన్నట్లుగా లొకేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలో నాగేశ్వర వేను తిరిగి వెళ్లిపోయాడు. అయితే, ఏడో తేదీన మరొకసారి నాగేశ్వరరావు బాధిత మహిళకు కాల్ చేశాడు. అదే సమయంలో భర్త లొకేషన్స్ కూడా నాగేశ్వరరావు తీసుకున్నాడు. భర్తకు సంబంధించిన లొకేషన్స్ ఫోన్ లొకేషన్స్ అన్నీ కూడా నల్గొండ ఎలిమేడు ప్రాంతంలోనే ఉన్నట్టుగా గుర్తించాడు. దీంతో భర్త ఇక్కడ లేడిని గుర్తించి నాగేశ్వరావు బాధిత మహిళ మన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తుపాకీ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, అదును కోసం చూస్తున్న భర్త వెంటనే ఇంటికి వచ్చాడు. ఇంటిలో నాగేశ్వరరావు చేస్తున్న పనిని చూసి ఒకసారిగా భర్తకు కోపం కట్టలు తగిలింది. దీంతో నాగేశ్వరరావు పైన దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముగ్గురు మధ్య జరిగిన సంఘటన సంబంధించి కచ్చితంగా సమాచారం బయటకు రాలేదు.
మరోవైపు వ్యవహారాన్ని సెట్ చేసుకుందామని చెప్పి నాగేశ్వరరావు ఫామ్ హౌస్ కి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇబ్రహీంపట్నం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగేశ్వరరావు నేరుగా సికింద్రాబాద్‌లోని ఒక లాడ్జి కొచ్చి తన దుస్తులు చేంజ్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. రెండు రోజులపాటు అజ్ఞాతంలో వెళ్లి నాగేశ్వరావు చెరువుకు చివరికి పోలీసులైతే లొంగిపోక తప్పలేదు. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసం వచ్చే మహిళల్ని ట్రాప్ చేసిన వ్యవహారంపైన ప్రభుత్వంతోపాటు పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారంలో డీజీపీకి ప్రభుత్వ ఆదేశాలు అందాయి. ఇక, మారేడుపల్లి మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొద్దిసేపటికి నాగేశ్వరరావుని హయత్ నగర్‌లోని జడ్జి ఇంటి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అత్యాచారం, సర్వీస్ రివాల్వర్. కిడ్నాప్ చేశారన్న తో బెదిరించారని ఆరోపణ మేరకు వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు పైనే కేసు నమోదైన తర్వాత రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగాడు. చివరికి పోలీసుల ఒత్తిడి పెరిగిపోవడంతో లొంగిపోతున్నట్లుగా సమాచారం ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నాగేశ్వరావుని పోలీసులు తీసుకున్నారు. 24 గంటల పాటు నాగేశ్వర్ ని ప్రశ్నించిన తర్వాత రిమాండ్ కు తరలించారు.
ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాచకొండ సీపీ మహేష్ భగవత్.. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు.. వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు.. నాగేశ్వరరావు వివాహిత ఇంట్లోకి చొరబడి అఘాత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. వివాహితపై రేప్, కిడ్నాప్. అక్రమ చొరబాటు, సర్వీస్ రివాల్వర్‌తో బెదిరింపులు.. లాంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. వివాహిత ఫిర్యాదు మేరకు నాగేశ్వర్‌రావుపై కేసు నమోదు చేశామని.. నాగేశ్వరరావుని నిన్న అరెస్ట్ చేసినట్టు తెలిపారు.. కాగా, నాగేశ్వరరావు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.