Playing Cards : ‘కిట్టి పార్టీ’ పేరుతో పేకాట.. భర్త టాస్క్ తో టాస్క్ ఫోర్స్ ఎంట్రీ..!
- భర్త ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన పేకాట కేసు
- లలితా నగర్‌లో టాస్క్ ఫోర్స్ దాడి.. ఆరుగురు మహిళల అరెస్ట్
- మహిళల పేకాట వ్యసనం ..పెరుగుతున్న ‘కిట్టి పార్టీ’ కల్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Playing Cards : సాధారణంగా మహిళలకు సీరియల్స్ చూడడం ఇష్టం ఉంటుంది. చీరలు, గాజులు, నగలు పెట్టుకోవడంపైన మోజు ఉంటుంది. సీరియల్స్ విషయంలో కొంత మంది మహిళలు పిచ్చిగా ఉంటూ ఉంటారు. అంతే కాదు సీరియల్స్‌ను వ్యసనంగా మార్చుకుంటారంటే కూడా అతిశయోక్తి లేదు. అలాంటి మహిళలు కొంత మంది ఇప్పుడు పేకాటకు కూడా బానిస అవుతున్నారు. భర్తను పట్టించుకోకుండా పేకాట ఆడుతున్నారు. ఇలాంటి ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఈ పాట పురుషులు పేకాడుతున్నప్పుడు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పాట మార్చాల్సిందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పురుషులతో సమానంగా మహిళలు సైతం పేకాట ఆడుతున్నారు. విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో ఆరుగురు మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.. యస్ మీరు విన్నది కరెక్టే. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసులకు ఒక వింత కేసు ఎదురయింది. తన భార్య రోజు కొంతమంది మహిళలతో కలిసి పేకాట ఆడుతూ ఓవైపు సమయాన్ని మరోవైపు ధనాన్ని అతిగా వృధా చేస్తుందని.. కనీసం తనకి తిండి పెట్టే ఉద్దేశం కూడా లేకుండా ఎప్పుడూ పేకాట ఆడడానికి వెళ్లిపోతోందని పోలీసులను ఆశ్రయించాడు ఓ భర్త. అయితే ఈ కేసును పెద్దగా నాలుగో పట్టణ పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్
దీంతో అతను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించాడు. ఫలితంగా..బాధితుని వద్ద మరింత సమాచారం తెలుసుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులకు కేసును అప్పగించారు.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. విశాఖలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లలిత నగర్‌లో ఓ ప్రాంతంలో దాడి చేశారు. ఆరుగురు మహిళలు పేకాట ఆడుతుండగా నాలుగవ పట్టణ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు శివారు ప్రాంతాలలో లేదా క్లబ్బులలో పబ్బులలో జూదం ఆడుతూ పోలీసులు దొరికిన యువకులను చూసి ఉంటాం.. కానీ మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడడం చర్చనీయాంశమైంది. అంతే కాదు సొంత భర్తే.. భార్యపై ఫిర్యాదు ఇవ్వడం.. ఆపై దగ్గరుండి పోలీసులతో దాడులు చేయించడం..కూడా అరుదుగానే జరిగిందనే చర్చ జరుగుతోంది… కనీసం భర్తలకు తిండి కూడా పెట్టకుండా.. వంట కూడా చేయకుండా.. ఈ విధంగా పేకాటకు బానిసైన మహిళా మణులు ఎంతోమంది ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో కొన్ని కిట్టి పార్టీల పేరిట ఈ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతుందని భార్యా బాధితులు చెబుతున్నారు.
Raksha Bandhan: అడవి వీడి అన్న చెంతకు.. 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన చెల్లి..
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!