AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు తన ప్రవర్తన మార్చుకోలేదని తెలుస్తోంది.
దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం అతనికి గుండు కొట్టి.. చెప్పులు, చీపురుల్లు కట్టి గ్రామంలో ఊరేగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలపై వేధింపుల ఘటనలపై కఠిన చర్యలు అవసరమని ఒకవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తులను అవమానించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!