ఎంత పెద్ద నేరాలు చేసిన వాళ్ళు అయిన సరే చిన్న క్లూతో దొరికిపోతారు.. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు.. ఈ మధ్య జరిగిన ఎన్నో ఘటనలు చిన్న క్లూ తో నిజాలు తెలిసిపోయాయి.. తాజాగా జరిగిన ఓ మర్డర్ కేసును ఒక కండోమ్ తో పోలీసులు చాక చక్యంగా చేదించారు.. అసలు మర్డర్ చేసిన నిందితులు ఎవరో పట్టించింది.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సర్కస్ కళాకారుడు అజబ్ సింగ్‌గా గుర్తించారు. అజబ్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి, ఆపై పాఠశాలకు తీసుకువచ్చి ఇక్కడి ఫర్నీచర్‌తో సహా మృతదేహాన్ని తగల బెట్టినట్లు గుర్తించారు. అయితే, ఘటనా ప్రదేశంలో ఎలాంటి క్లూస్ లభించలేదు. కండోమ్ ప్యాకెట్ సహా చిన్నపాటి క్లూస్ లభించాయి. ఇందులో కండోమ్ ప్యాకెట్ కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది.. ఆ కండోమ్ కేసులో ట్విస్ట్ ను తీసుకొచ్చింది..
జూన్ 11న, అక్బర్‌పూర్ బ్లాక్ పరిధిలోని భిత్రి దీహ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల లో అజబ్ సింగ్ మృతదేహం కలకలం రేపింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఇతర ఆధారాల తో పాటు టైమెక్స్ బ్రాండ్ కండోమ్ ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు.. నిజానికి సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సర్కస్ ఏర్పాటు చేసేందుకు ఈ గ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ఆర్తి అనే మహిళ ఇంట్లో బస చేశారు. దీని ఆధారంగా ఆ ఇంటి పరిధిలో యాక్టీవ్‌గా ఉన్న మొబైల్ నెంబర్స్, కాల్స్, నెట్‌వర్క్ ఆధారంగా ఎంక్వైరీ చేశారు. హత్య అనంతరం నిందితు లు ఆ ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించారు.. అసలు కారణం అక్రమ సంబంధం అని తెలిసింది.. మొత్తానికి కేసు ఎండ్ అయ్యింది..