కంత్రీగాళ్లు.. కారు అమ్మినట్టే అమ్మి.. మళ్లీ పేపర్స్ చేతుల్లో పట్టుకుని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేటలోని కొన్ని కార్ కన్సల్టెన్సీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి వారిపై ఎన్ని కేసులు నమోదు చేసినా తీరు మారడం లేదు. పోలీసులు కూడా కార్ కన్సల్టెన్సీ ఏజెన్సీ మాయగాళ్లకు సహకరిస్తున్నారని బాధితులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం జోరందుకుంది. చాలా మంది మధ్య తరగతి వాళ్లు కూడా కారు కొనుక్కోవాలనే ఉత్సాహం చూపిస్తుండడంతో సెకండ్ హ్యండ్ కార్ల పరిశ్రమ 3 పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కానీ సరిగ్గా ఇక్కడే కేటుగాళ్లు సైతం రంగంలోకి దిగారు. మధ్యతరగతి జనాన్ని ఈజీగా మోసం చేస్తున్నారు.. అలాంటిదే ఓ కార్ ఏజెన్సీ బాగోతం బయట పడింది. ఇక్కడ చూడండి. ఇది శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ. ఈ కార్ కన్సల్టెన్సీ పక్కా ఫ్రాడ్. ఎందుకు అంటే చాలా మంది జనాలను ఈ కన్సల్టెన్సీ యాజమాన్యం మోసం చేసింది..
READ MORE: Hyderabad: చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు.. దేవుడి చాటున గలీజ్ దందా..?
నిజానికి మధ్యతరగతి వారు పాపం అప్పోసొప్పో చేసి యూజుడ్ కార్ తీసుకుంటారు. కానీ ఆ ఆనందాన్ని వారికి పట్టుమని 10 రోజులు కూడా ఉండనివ్వరు. ఎందుకంటే శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ లాంటి సంస్థలు.. కారు వాళ్లకు అమ్మినట్లుగానే అమ్మి.. తమ మనుషులకు కారు పేపర్స్ ఇస్తున్నాయి. దీంతో కారులో కుటుంబంతో సహా వెళ్తున్నప్పుడు ఆ మనుషులు అడ్డు పడతారు. ఇది మా కార్ నువ్వు ఎలా కొన్నావ్ అంటూ రంగంలోకి దిగుతారు. అమాయకులైతే బెదిరిస్తారు. పేపర్లు చూపించి దబాయిస్తారు. అంతటితో ఆగకుండా కారు తీసుకుని ఉడాయిస్తారు. తీరా వెళ్లి శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ యజమాన్యాన్ని అడిగితే… మాకేం తెలియదని బుకాయిస్తారు. ఇదీ ఇక్కడ జరుగుతున్న చీటింగ్. ఈ కారు కన్సల్టెన్సీ బారిన పడి చాలా మంది మోసపోయి లబోదిబోమంటున్నారు.
READ MORE: Kakinada: కాకినాడలో పరువు హత్య కలకలం..
మరోవైపు శ్రీ బాలాజీ కారు కన్సల్టెన్సీపై ఇప్పటికే చాలా FIRలు నమోదై ఉన్నాయి. కానీ ఏనాడు ఆ యజమాని స్టేషన్‌కు వచ్చింది లేదు. జైలుకు వెళ్లింది లేదు. బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చింది లేదు. ఎవరైనా కేసు పెట్టాలని వస్తే వారి చెప్పులు అరిగిపోవాల్సిందే తప్ప న్యాయం జరగదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక బాధితులను మస్కా కొట్టించేందుకు మరో కార్ కన్సల్టెంట్ యజమాని వెంకటేష్ ముదిరాజ్.. తాను నిజాయితీపరుణ్ణి.. మీకు డబ్బులు ఇప్పిస్తాను అని మధ్యవర్తిగా రంగలోకి దిగి బాధితులని ఒత్తిడి చేయకుండా ఆపుతాడు. చివరకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. ఇద్దరు కన్సల్టెన్సీ యజమానులు ఇలా అందినంతా దోచుకుంటున్నారు.. మరోవైపు శ్రీ బాలాజీ కార్స్‌ని ఆదర్శంగా తీసుకున్న అక్కడి సెకండ్ హ్యాండ్ కార్స్ వ్యాపారులు మరి కొందరు ఇదే బిజినెస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ బల్కంపేట్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలంటే జనం జంకుతున్నారు..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..