పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అఘాయిత్యాలు చేసేవారు. కాకినాడ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో టచ్‌లో ఉన్న యువకున్ని..యువతి సోదరుడు హతమార్చాడు. వేమవరంలో ఈ హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు కిరణ్ కార్తీక్. కాకినాడ జిల్లా వేమవరం స్వస్థలం. అతని తండ్రి వెంకటరమణ ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తండ్రికి సహాయంగా కిరణ్ కార్తీక్ కూడా అక్కడే పని చేస్తున్నాడు. అయితే షాపులో డబ్బులు విషయంలో తేడా రావడంతో గత నెల 24న వెంకట రమణ.. కొడుకు కిరణ్‌ను మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కార్తీక్ ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో 3 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఐతే చివరికి అతని ఫోన్‌లో కాల్ లిస్ట్ ఆధారంగా మిస్టరీ ఛేదించారు. వేమవరంకు చెందిన ఓ యువతితో కిరణ్ కార్తీక్‌కు పరిచయం ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఐతే యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయం నచ్చలేదు. అతన్ని దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువతి తల్లిదండ్రులు, అన్నయ్య కృష్ణ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉంటుండగా.. ఆమె కాకినాడలోని ఓ హాస్టల్లో ఉండి నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా ఇద్దరూ మనను మార్చుకోవడం లేదని యువతి అన్నయ్య కృష్ణ ప్రసాద్.. కిరణ్ కార్తీక్‌ను చంపేయాలని ప్లాన్ వేశాడు..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
అచ్చంపేట దగ్గరలోని బ్రహ్మానందపురం కాలనీ దగ్గరికి రావాలని కిరణ్ కార్తీక్‌కి చెప్పాడు కృష్ణ ప్రసాద్. తన చెల్లితో పెళ్లి విషయం మాట్లాడతానని అన్నాడు. దాంతో కిరణ్ కార్తీక్ అక్కడకి వెళ్లాడు. అతనికి ఫుల్‌గా మద్యం తాగించారు. ఈ సిట్టింగ్‌కి కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు వినోద్‌ని కూడా తీసుకుని వెళ్లాడు. మందు తాగిన తర్వాత తన చెల్లిని వదిలేయాలని దూరంగా ఉండాలని ఆమెను కష్టపడి చదివిస్తున్నామని అన్నాడు కృష్ణ ప్రసాద్. ఈ విషయాలు చెప్పడానికి అంటే అసలు తాను వచ్చేవాడిని కాదని ఎదురు తిరిగాడు కిరణ్ కార్తీక్. దాంతో ముందే ప్లాన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్, వినోద్.. కిరణ్ కార్తీక్ తలను నేలకేసి కొట్టి చంపేశారు. అదంతా ఓపెన్ సైట్ కావడంతో అక్కడే పూడ్చిపెట్టారు. తిరిగి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు..
READ MORE: 100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్ లాంచ్
కిరణ్ కార్తీక్ మృతితో అంతా అయిపోయిందని భావించారు. ఆ తర్వాత రెండు రోజులకు కృష్ణ ప్రసాద్ యధావిధిగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ సరిగ్గా ఇక్కడే కథ షురూ అయింది. కిరణ్ కార్తీక్ అదృశ్యానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఊర్లో పోలీసుల ఎంక్వయిరీలు.. కిరణ్ కార్తీక్ మొబైల్ కాల్ డేటా చెక్ చేయడం తెలియడంతో వినోద్ హడలిపోయాడు. వెంటనే విషయాన్ని కృష్ణ ప్రసాద్‌కి చెప్పాడు. ఊళ్లో పరిస్థితి బాలేదని జరిగిన ఘటన గురించి పోలీసులు విచారణ వేగవంతం చేశారని అన్నాడు. దాంతో తిరిగి వచ్చిన కృష్ణ ప్రసాద్ హత్య తామిద్దరం చేసామని పోలీసులుకి చెప్పి.. మృతదేహాన్ని పూడ్చిన దగ్గరికి తీసుకుని వెళ్లారు.
READ MORE: Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?
కిరణ్ కార్తీక్.. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ హత్యలో నిందితులు ఇంకా ఉండి ఉంటారని కిరణ్ కార్తీక్ పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. మొత్తానికి చెల్లిని ప్రేమిస్తున్నాడని అతికిరాతకంగా యువకుడిని కడతేర్చాడు కృష్ణ ప్రసాద్. ఆమె కెరీర్ పోతుందని ప్రేమించిన వాడిని చంపి పూడ్చి పెట్టాడు. తమ కొడుకు అన్యాయంగా బలయ్యాడని కిరణ్ కార్తీక్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.