UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..
- మహిళతో పారిపోయిన తమ్ముడు..
- అన్నను పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ కుటుంబం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ రజినీకాంత్ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
వివరాల ప్రకారం.. అర్షద్ తమ్ముడు అమీర్ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మహిళ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి అర్షద్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో చుట్టుముట్టారు. అతడిని బందీగా తీసుకుని కర్రలు, బెల్టులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్షద్‌ని ఉదయం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అతడిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే క్రమంలో కూడా దాడి చేశారు. ప్రస్తుతం గాయపడిన బాధితుడిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ కేసులో పాత పగలు ఉన్నాయని, దీంతోనే దాడి జరిగినట్లు డేటాగంజ్ సీఐ కేకే తివారీ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత సెక్షన్ల కింద తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తివారీ తెలిపారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?