సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ప్రధానీ నరేంద్ర మోడీ బ్యానర్‌పై అదే పనిగా ఓ వ్యక్తి రాయి విసురుతూ కనిపించాడు. దీంతో అక్కడ భారీగా జనం గుమికూడి అతడిని వింతగా చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్ర నాగపూర్‌లో జరిగినట్టుగా సమాచారం. ఈ వీడియో ఓ వ్యక్తి స్థానిక బస్టాప్ వద్ద ప్రధాని మోదీ బ్యానర్‌ను చూశాడు. బీజేపీ ఏర్పాటు చేసిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారంలో భాగంగా బస్టాప్‌లో ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అది చూసిన ఆ వ్యక్తి రాయి తీసుకుని బ్యానర్‌పై ఉన్న మోదీ ఫొటోపై పలు మార్లు విసురుతూ ఉన్నాడు.
Also Read: Karnataka: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
అతడిని చూసి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాక అతడినే చూస్తూ ఉన్నారు. అందులో కొందరు ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇదే వీడియోను గుజరాత్ కాంగ్రెస్ నేత హితేంద్ర పితాడియా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఇలా స్పందించారు. ‘నరేంద్ర మోడీపై నాగ్‌పూర్‌లో అంత ద్వేషమా!’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. కాగా నాగ్‌పూర్ పోలీసులు ఈ ఘటనపై స్పందించి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
Also Read: Amit Shah : అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం