బెంగళూరులో ఆదివారం జరిగిన అత్యాచార ఘటనలో ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రత కరవైందని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఈ విమర్శలను సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు. బీజేపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదా? అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది.
ఇది కూడా చదవండి: TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. ఖండించిన టీజీఎస్‌ఆర్టీసీ
తమిళనాడుకు చెందిన మహిళ(37).. భర్తతో గొడవపడి కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం రాత్రి 11:30 ప్రాంతంలో బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ప్రాంతంలోని బస్టాండ్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తోంది. యలహంకకు వెళ్లి బస్సు గురించి ఆమె ఆరా తీయగా.. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు సాయం చేస్తామంటూ నమ్మించి గోడౌన్ స్ట్రీట్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఇద్దరు అత్యాచారం చేయడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు, నగదు, ఫోన్ దోచుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఇద్దరు అనుమానితులైన శరవణ్ (35), గణేష్ (23) అనే ఇద్దరు కూలీలను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
బెంగళూరు సెంట్రల్ డివిజన్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అత్యాచారం తర్వాత నిందితులిద్దరూ అనుమానం రాకుండా కూలీ పనుల్లో నిమగ్నమైపోయారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని షెల్టర్‌హోమ్‌కు తరలించామని, విచారణ జరుపుతున్నామని కమిషనర్ బి. దయానంద తెలిపారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి.. కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటన