యవ్వన ప్ర్రాయంలో కొన్ని కొన్ని కోరికలు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ కోరికలు ఎంతటి దారుణాలనైనా చేయిస్తాయి. అలంటి వాటి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉంటే సరే.. లేకపోతే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే యువకుడి జీవితంలా మారిపోతుంది. బోనస్ డబ్బులతో కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేద్దామనుకున్న యువకుడి చిన్న పొరపాటు అతడిని ఆసుపత్రి పాలు చేసింది. అతడిపై దాడి చేసి, అతడి వద్ద ఉన్న డబ్బును తీసుకొని పారిపోయారు కాల్ గర్ల్స్. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. రాజస్థాన్ కి భగీరథ్ అనే యువకుడు జైపూర్‌లోని ఉన్న ఓ ప్రముఖ విద్యాసంస్థలో పని చేస్తున్నాడు. దీపావళీ కావడంతో అతడికి బోనస్ కూడా వచ్చింది. దీంతో ఆ యువకుడి మనసులో ఒక చిన్న కోరిక కలిగింది. కాల్ గర్ల్ తో ఒక రోజంతా ఎంజాయ్ చేసి, మిగతా డబ్బుతో ఊరికి వెళదామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక బ్రోతల్ కంపెనీకి కాల్ చేసి కాల్ గర్ల్ ని బుక్ చేసుకున్నాడు. వారు కూడా ఇద్దరు గర్ల్స్ ని పంపిస్తున్నామని, తనకిష్టమైన వారిని ఎంచుకోవాల్సిందిగా కోరారు. రాత్రంతా అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు అన్న ఊహతో వారు చెప్పిన డ్రెస్ కి వెళ్లి వెయిట్ చేశాడు.
కారులో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఒకరిని సెలెక్ట్ చేసుకున్న యువకుడు కంపెనీ కి ఆన్ లైన్ పేమెంట్ చేయబోతుండగా.. ఆలా చేస్తే డబ్బులు వారికి వెళ్తాయి కానీ, మాకు రావు అని, అపో క్యాష్ కావాలంటూ యువతులు పట్టుబట్టారు. దీంతో యువకుడు తన పర్సులో ఉన్న శాలరీ మొత్తం లక్ష రూపాయలలో నుంచి కొత్త మొత్తాన్ని తీయబోతుండగా.. అంత మొత్తం తమకే కావాలని ఆశపడిన యువతులు, యువకుడిపై దాడి చేసి, అతడిని పక్కకి నెట్టి, ఆ డబ్బుతో ఉడాయించారు. దీంతో భగీరథ్ ఒక్కసారిగా షాకయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భగీరథ్ ని ఆసుపత్రిలో చేర్పించి, కేసు నమోదు చేసుకున్నారు.