Suryapet Crime: తాటిచెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి.. మృతదేహాన్ని దించుతుండగా షాకింగ్ ఘటన
- సూర్యాపేట జిల్లాలో విషాదం..
- గీత కార్మికుడైన వెంకటేశం తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య..
- వెంకటేశం మృత దేహాన్ని కిందికి దించుతుండగా మరో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కిందకి దించుతుండగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Read also: Health Tips : కాలేయాన్ని రక్షించే కాఫీ.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..!
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
సూర్యపేట జిల్లాలోని ముకుందాపురానికి చెందిన 75 ఏళ్ల దేశగాని వెంకటేశం.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్యకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో సమస్యలను తట్టుకోలేక శుక్రవారం కల్లు తీసేందుకు గ్రామ శివారుకి వెళ్లి.. తాటిచెట్టు ఎక్కి ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్నవారు.. తాటిచెట్టుకు వెంకటేశం వేలడటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు, పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుమారు 50 అడుగుల ఎత్తులో వెంకటేశంను కిందకు దించే ప్రయత్నంలో.. గ్రామానికి చెందిన కొందరు యువకులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మృతదేహాన్ని కిందకు దించే సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఒక యువకుడు తాటి చెట్టు పైకి ఎక్కి మృత దేహాన్ని కిందికి దించే ప్రయత్నం చేస్తుండగా.. మరో యువకుడు నాగార్జున తాడు సాయంతో చెట్టు మధ్య వరకు చేరుకున్నాడు. డెడ్‌బాడీని తాడు సాయంతో కిందకు దించుతుండగా.. అనూహ్యంగా తాడు తెగిపోయింది. దీంతో మృతదేహం చెట్టు మధ్యలో ఉన్న నాగార్జునపై బలంగా దూసుకొచ్చింది. మృతదేహంతో పాటు నాగార్జున కింద పడిపోయాడు. ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగార్జున పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
KTR Tweet: హైదరాబాద్ కు రాహుల్ రావాలి.. కేటీఆర్ ఆహ్వానం
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!