Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories To Avenge Fathers Death Man Murders Killer In Same Way After 22 Years

Revenge: 22 ఏళ్ల పగ.. తండ్రిని ఎలా చంపాడో, అలాగే వ్యక్తిని చంపేసిన కొడుకు..

Published Date :October 4, 2024 , 4:39 pm
By Venu Goapl Reddy
  • 22 ఏళ్ల నాటి పగ.. వ్యక్తి దారుణ హత్య..
  • తండ్రిని హత్య చేసిన వ్యక్తిని చంపిన కొడుకు..
Revenge: 22 ఏళ్ల పగ.. తండ్రిని ఎలా చంపాడో, అలాగే వ్యక్తిని చంపేసిన కొడుకు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.

నఖత్ సింగ్ భాటి(50) మంగళవారం సైకిల్‌పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన గోపాల్‌ని పోలీసులు పట్టుకున్నారు. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, గోపాల్ ఉద్దేశపూర్వకంగానే నఖత్ సింగ్‌ని ఢీకొట్టి, ట్రక్కు అతడిపైకి ఎక్కించినట్లు తేలింది.

Read Also: KVP Ramachandra Rao: నా ఫాంహౌస్ అక్రమమైతే నేనే కూలుస్తా..

విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పగ-ప్రతీకారం గురించి గోపాల్ పోలీసులకు చెప్పాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని తేలింది. 2002లో రాజస్థాన్ జైసల్మీర్‌లో గోపాల్ తండ్రి హరిసింగ్ భాటిని ట్రక్కుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ కేసులో నఖత్ సింగ్‌తో పాటు అతడి నలుగురు సోదరుల ప్రమేయం ఉంది. వీరికి ఏడేళ్ల శిక్ష విధించబడింది. అప్పటి నుంచి తండ్రిని హత్య చేసిన నఖత్ సింగ్‌పై గోపాల్ పగ పెంచుకున్నారు. ఎలాగైనా చంపాలని భావించాడు.

ఈ హత్య కోసమే గోపాల్ గత వారం రూ.8 లక్షలతో పికప్ ట్రక్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు కోసం రూ. 1.25 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాడు. నఖత్‌ని చంపేందుకు అతడి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడు. పోలీసులు గోపాల్ మొబైల్ వివరాలు పరిశీలించడంతో ఈ విషయం తేలింది. నఖత్, గోపాల్ కుటుంబాల మధ్య కొంతకాలంగా శత్రుల్వ ఉందని పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crime
  • Crime News
  • Gujarat
  • revenge
  • Revenge Murder

తాజావార్తలు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions