Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ప్రేమజంటపై నడిరోడ్డుపై దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు చందు, శివస్నేహ రక్షణ కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నవవధువు మెడలోని తాళిబొట్టు తెంచి, యువకుడిపై దాడికి దిగారు. భయంతో సమీప కార్యాలయంలో ఆశ్రయం పొందిన దంపతులను స్థానికులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేయగా..పోలీసులు తమ కుటుంబ సభ్యులను అక్రమంగా తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అడ్డగించి భౌతిక దాడులకు దిగారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు సమీపంలోని కార్యాలయంలోకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జులై 19న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే, శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ పేరుతో రాయచోటి పోలీసులు తన కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగుతున్నారని యువకుడు చందు తీవ్రంగా ఆరోపించాడు. 3 రోజుల క్రితమే తన తల్లి, పెద్దమ్మ, మేనమామలను పోలీసులు తీసుకెళ్లారని.. వారి ఆచూకీ కూడా తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చందు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలోనే యువతి బంధువులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పాడు.
దాడి సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి కుటుంబ సభ్యులు నవవధువు మెడలోని తాళిబొట్టును తెంచివేసి, చందుపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ప్రశాంతంగా ఉండే ఎస్పీ ఆఫీస్ పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన స్థానికులు, దంపతులకు ఆశ్రయం కల్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో నవవధువు శివస్నేహ స్టేట్మెంట్ను అధికారికంగా నమోదు చేసుకున్నారు. నవ దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వివరాలను రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువ జంటలపై బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ దంపతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!