నెలలు నిండిన ఆడ పిల్లలకు కూడా భద్రత లేని సమజలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా బ్రతికే రోజులు వచ్చాయి. చిన్న, పెద్ద, ముసలి అని కూడా చూడకుండా మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో హత్యాచార కేసులకు అంతులేకుండా పోయింది. ఇందులో భాగంగా రీసెంట్ గా విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారట. ఓ ప్రైవేటు స్థలం లీజు అగ్రిమెంట్ కోసం సదరు మహిళ, వైజాగ్ నగరానికే చెందిన వైద్యుడు శ్రీధర్ (52) అనే వ్యక్తి ఇటీవల విశాఖ వచ్చారట. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉందట. శ్రీధర్ గదిలోనే ఆమె కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె హోటల్ గదిలోని బాత్రూంలో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీధర్ స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఇక, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. చట్టం కొందరికి చుట్టం అనేలా ఉందట. ఇందులో ఓ డాక్టర్ హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టం పూర్తి చేశారట. కానీ, ఈ ఎన్నారై మహిళ శారీరంపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. మరి ఇంతకీ ఏం జరిగింది.. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉంది.