Selfie Suicide: అన్నీ బంధాలకంటే భార్యభర్తల బంధం బలమైనది అంటారు. మగాడి జీవితంలో. ఎక్కువ పాత్ర పోషించేది భార్యే. భార్యలను కొందరు భర్తలు ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. అలా ప్రేమగా చూసుకునే భర్తలు.. తమ భార్యలకు అనుకోకుండా ఏమైనా జరగడం కానీ అయితే వాళ్లు తట్టుకోలేరు. వెంటనే ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడుతారు. సమాజంలో భార్యాభర్తల మధ్య కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నా.. ఇంకొందరు మాత్రం భార్యలను తమ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు.
Read Also: Nadipelli Diwakar Rao : మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్ధిగా మళ్లీ దివాకర్ రావు.!
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య కన్పించడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య కన్పించడం లేదని పోలీసులకు కూడ భర్త ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన వివాహిత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ వివాహిత లభ్యం కాలేదు. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భర్త సెల్ఫీని రికార్డు చేశాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు సెల్ఫీ వీడియోలో నువ్వు లేక నేను లేను శ్వేత అంటూ.. చివరిసారిగా వీడియో చిత్రీకరించి సూసైడ్ చేసుకున్నాడు భర్త. అయితే ఆ వీడియో చూసిన జనాలు కన్నీరు పెడుతున్నారు. ఇంత ప్రేమగా చూసుకునే భర్తను వదిలి ఎటు వెళ్లిపోయిందోనని.. స్థానికులు అంటున్నారు. మరోవైపు ఆ మహిళ జాడ దొరకబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.