ఇటీవల తెలంగాణాలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం వెలుగుచూసింది.. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు… అయితే వెంటంనే మంటలను అదుపు చెయ్యడం తో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు..
ఆస్పత్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
ఇకపోతే ఈ ఏడాది మార్చిలో సికింద్రాబాద్ లోని 8 అంతస్తుల స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదో అంతస్తు ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పై అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల్లో ఇది తాజాది. మృతులను ప్రమీల, వెన్నెల, శ్రావణి, శివగా గుర్తించారు. కారిడార్లలో మంటలు చెలరేగడంతో ఐదో అంతస్తులోని వాష్ రూమ్ దగ్గర ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. ఇలాంటి వాటిని నిపుణులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..