పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు.. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ పెళ్లిని వారిస్థాయికి తగ్గట్లు ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అత్తవారింట్లో అడుగు పెడతారు..ఓ యువతి కూడా చాలా సంతోషంగా మెట్టింట్లో అడుగుపెట్టింది.. అయితే నెల రోజులలోపే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది..
వివరాల్లోకి వెళితే.. వసంత్‌నగర్‌లో ఉండే నరేష్ గౌడ్ అనే వ్యక్తి గాజుల రామారానికి చెందిన నందినిని నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఘనంగా వీరి పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాక.. నందినిని అత్తవారింటికి పంపించారు. అయితే ఆమె శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది..
గది లో నుంచి ఎంతసేపైనా రాకుంటే అత్త, భర్త తలుపుతట్టి చూశారు. ఎంత పిలిచినా ఆమె నుంచి ఉలుకుపలుకు లేకపోవటం తో అనుమానం వచ్చి గది తలపులు బద్దలుకొట్టి చూశారు. ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడటం ఒక్కసారిగా షాకయ్యారు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇక మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో అనుమానపు మృతి కింద కేసు నమోదు చేశారు.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు..