Techie Jumps 20 Floors To Death In Noida: తన చిన్ననాటి స్నేహితురాలతో రోజంతా గడపాలని అబ్బాయి అనుకున్నాడు. కానీ, వీరి మధ్యలో మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ సంతోష ఘడియలు గొడవగా మారాయి. చివరికి ఓ ప్రాణం కూడా పోయింది. ఈ విషాద ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి (26), తన చిన్ననాటి స్నేహితరాలిని (25) కలిసేందుకు నోయిడా వచ్చాడు. వీళ్లిద్దరూ కలిసి.. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్ సొసైటీలో ఆన్‌లైన్ యాప్ ద్వారా గురువారం రాత్రి ఒక రూం బుక్ చేసుకున్నారు. రాత్రంతా మందు తాగి, బాగానే ఎంజాయ్ చేశారు.
Bopparaju Venkateswarlu: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 26వ తేదీ డెడ్‌లైన్
అయితే.. తర్వాతి రోజు ఆ అమ్మాయి తన స్నేహితురాలిని కూడా ఆ అపార్ట్‌మెంట్‌కి పిలిపించింది. దాంతో ఖంగుతిన్న అతగాడు.. ఏం చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోయాడు. రోజంతా గడిపిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆ అమ్మాయి స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లడమే ఆలస్యం.. ఆ అబ్బాయి తన స్నేహితురాలితో గొడవకు దిగాడు. ‘నీతో నేను రోజంతా గడపాలి అనుకున్నా. కానీ, నువ్వు నీ ఫ్రెండ్‌ని కూడా పిలిచావు. అసలెందుకు పిలిచావు?’’ అంటూ ఆమెపై అరిచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాను ఏమైనా చేసుకుంటానని ఆ టెక్కీ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ అమ్మాయి.. కింద సెక్యూరిటీ గార్డుని అలర్ట్ చేయడానికి వెళ్లింది. ఇంతలో ఆ టెక్కీ అన్నంత పని చేశాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని 20వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కెఫే టేబుల్స్‌పై పడటంతో, అవి విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు సైతం గాయాలయ్యాయి.
Naftali Bennett: జెలన్ స్కీని చంపనని పుతిన్ ప్రామిస్ చేశాడు.. ఇజ్రాయిల్ మాజీ పీఎం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ మధ్య మరో అమ్మాయి రావడంతో టెక్కీకి, చిన్ననాటి స్నేహితురాలికి గొడవ జరిగిందని.. దాంతో మనస్తాపం చెంది అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఆ టెక్కీ త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో రోజంతా గడపాలని నిర్ణయించుకున్నాడని తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అతడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు హర్యానాలోని సోనిపత్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.