Sheelavathi Ganja: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ బారిన పడింది. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగరంలో రోజురోజుల్లోనే కొత్త డ్రగ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎస్‌ఆర్‌నగర్ బాలుర హాస్టళ్ల సెంటర్‌లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు వెలుగుచూసిన ఘటన మరువకముందే శంషాబాద్‌లో పోలీసులు 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సంచలనంగా మారారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కెమికల్ డ్రమ్స్ మధ్యలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు కంటైనర్ లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 800 కిలోల పైచిలుకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అత్యంత నాణ్యమైన శీలావతి రకం గంజాయి సీజ్ చేశారు. గంజాయి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించేందుకు యత్నం చేస్తున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 400 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు.
Read also: Cab Drivers Protest: ఒకే కారుకు రెండు నంబర్లు.. శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్లు నిరసన..
తాజాగా.. ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ గుట్టు రట్టయింది. దీంతో ఎస్సార్ నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది.ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హాస్టల్ లో పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి సుమారుగా 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకున్నట్లు వెల్లడించారు. 250 గ్రాముల గంజాయి ,115 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ లను అరెస్టు చేశామన్నారు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్మకాలు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. రవూఫ్ కు నైజీరియా కు చెందిన నెగ్గెన్ వ్యక్తితో సంబంధం ఉన్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్ సమావేశం..