Bus Accident : సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!
- సంగారెడ్డి: కంది దగ్గర NH 65పై రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న టిప్పర్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- 22 మంది ప్రయాణికులకు గాయాలు
- గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలింపు
- మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
- ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద ఇదే బస్సు ఒక స్కూటీని కూడా ఢీకొట్టిందని, అయినా డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Minister Ramprasad Reddy: జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..
గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసరమైన సిటీ స్కాన్ (CT Scan) కోసం బాధితులు అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి క్లిష్ట సమయంలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై బాధితుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు.
బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ప్రాణాపాయం తప్పి అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అటు పోలీసులు, ఇటు ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
New Year Celebration Ideas: ఈ న్యూ ఇయర్‌కి ప్లాన్స్ ఏం లేవా? ఇవి ట్రై చేయండి..
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!