Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం…