Crime : తల్లి హత్య..15 రోజుల మిస్టరీ ముగిసింది
- బంకెల సంతుకు 37 ఏళ్లు
- భర్తతో విభేదాలతో ఒంటరిగా జీవనం
- ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలతో డబ్బు వృథా చేస్తున్న సంతు
- తల్లితో కుమార్తెలు, మరిది మురళీధర్ గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కనిపెంచిందన్న కనికరం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిందన్న విశ్వాసం లేదు. తల్లి ప్రవర్తనతో విసుగు చెంది బాబాయ్ సహాకారంతో కన్న తల్లినే అతి దారుణంగా అంతమొందించారు కన్న కూతుళ్లు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలో ఓ మహిళ మృత దేహం 15 రోజుల కిందట తీవ్ర కలకలం రేపింది. హైవేకు కూత వేటు దూరంలోనే పొదల్లో సగం కాలిన మృతదేహం అప్పట్లో సంచలనం కలిగించింది. చుట్టూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిస్టరీగా మారింది. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు అనేది కొద్ది రోజుల పాటు మిస్టరీగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద 15 రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లి ప్రవర్తనతో విసుగుచెందిన కుమార్తెలు.. బాబాయ్‌తో కలిసి హత్యకు ప్లాన్ వేసి మర్టర్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది…
ఒడిశా రాష్ట్రానికి చెందిన బంకెల సంతుకు 37 ఏళ్లు.. భర్తతో కొంతకాలం క్రితం మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. సంతు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నది. పెద్ద కుమార్తె అనూష పంజాబ్‌లోని యూనివర్సిటీలో చదువుతున్నది. 15 ఏళ్ల చిన్న కుమార్తె ఇంటర్ ఫస్ట్ సంవత్సరం చదువుతూ, హాస్టల్‌లో ఉంటున్నది. తల్లి సంతు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు లోనయి డబ్బులు వృథా చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తెలతో పాటు సంతు మరిది మురళీధర్ ఇటీవల ఆమెతో గొడవపడ్డారు..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
హాస్టల్‌లో ఉంటున్న చిన్న కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఫోన్‌లో అసభ్యకర దృశ్యాలతో పాటు బెట్టింగ్ యాప్‌లు ఉండడాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని అక్క అనూషకు చెప్పడంతో ఆమె పంజాబ్ నుంచి ఇక్కడకు వచ్చింది. ఇద్దరూ కలిసి తల్లిని నిలదీసి, ఆమెతో గొడవపడ్డారు. తల్లి ప్రవర్తనతో విసుగు చెందిన కుమార్తెలు… ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌నగర్‌లోనే నివాసం వుంటున్న బాబాయ్ మురళీధర్‌కు ఈ విషయం చెప్పి, ఆయన సాయం కోరారు. ముగ్గురూ కలిసి ప్రణాళికను రూపొందించుకుని ఆగస్ట్ 13న అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో వున్న ఉన్న సంతుని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురళీధర్ తన స్నేహితుడి కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్దకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు…
ఆగస్ట్ 14న ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు, సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్బవరం పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తుహిన్ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. సంతుని ఆమె కుమార్తెలు, మరిది కలిసి హత్య చేసినట్టు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. మురళీధర్‌తోపాటు అనూషను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితురాలు మైనర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచినట్టు ఎస్పీ తెలిపారు..
Uttar Pradesh: రెచ్చిపోయిన హిజ్రాలు.. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!