కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా మరో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.