ఓ భగ్న ప్రేమికురాలు తన వ్యక్తిగత సమస్యను.. జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నించింది. తనకున్న టెక్నాలజీ తెలివి తేటలను వాడుకుని పోలీసుల కళ్లను కూడా బురిడీ కొట్టింది. చివరికి చిన్న మిస్టేక్‌తో దొరికిపోయింది. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? ఏం చేసింది? కొద్ది రోజుల కింద దేశవ్యాప్తంగా విమానాశ్రాయలకు, కార్పోరేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తుందా..? అది ఉగ్రవాదుల పని అయి ఉంటుందని పోలీసులు, నిఘా సంస్థలు అనుమానించాయి. ఆ బెదిరింపుల వెనుక ఎవరు…