Reels Craze: లైఫ్ రిస్క్ అయినా ఫరవాలేదు.. ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels Craze: యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. రీల్స్ మోజులో పడి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మిగతా వారు అలా ప్రాణాలు పోయిన వారిని చూసి కొంతైనా నేర్చుకోవడం లేదు. రీల్సా మాయలో పడి రియల్ జీవితాన్ని ఫణంగా పెడుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
రీల్స్.. నో రూల్స్.. ఇప్పుుడు యూత్‌లో ఇదే ట్రెండ్.. ఎవరూ చేయని రీల్ మనం చేయాలి.. వాయిస్: ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్. ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇదే టార్గెట్‌తో యువత రెచ్చిపోతున్నారు. రీల్స్ మోజులో పడి లైఫ్‌ను రిస్క్‌లోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ రావాలనే ఆలోచనల ముందు వారు ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ పిచ్చి మోజు కొందరి ప్రాణాలను కూడా తీసేస్తోంది. తిరుపతి జిల్లాలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
సూళ్లూరు పేట మండలం పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలానికి చెందిన కళ్యాణ్ ఇద్దరు స్నేహితులు. గతంలో అద్దె రూమ్‌లో ఉంటూ.. జాబ్ చేస్తూనే రీల్స్ చేసే వారు. సంవత్సరం క్రితం సునీల్ సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా.. కళ్యాణ్ శ్రీ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నెలన్నర క్రితం కళ్యాణ్‌కు వివాహం అయింది.
కొత్తగా పెళ్లయి కళ్యాణ్ సంతోషంగా ఉన్న సమయంలోనే రీల్స్ అతని ప్రాణాలను తీసింది. పేర్నాడుకు వచ్చిన సునీల్.. కళ్యాణ్‌ను బైక్ మీద ఎక్కించుకుని వెళ్లాడు. తడ మండలం కొండూరు రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. రైలు ఢీకొట్టి ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. కళ్యాణ్, సునీల్ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. వారి ఫోన్లకు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వారి కోసం వెతకడం ప్రారంభించారు.
Hyderabad Crime: మైకం మత్తులో యువత.. నగరంలో నేరాలకు పాల్పడుతున్న పోకిరీలు..!
చివరికి రైలు పట్టాలపై రెండు డెడ్‌బాడీలు పడి ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా వారిని కళ్యాణ్, సునీల్‌గా గుర్తించారు. రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో మృతి చెందినట్లు లోకోపైలెట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి మృతిపై పోలీసులకు క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల కన్న వారికి పుట్టెడు దుఃఖం మిగల్చడం తప్ప వచ్చేది ఏమీ ఉండదంటున్నారు పోలీసులు. సో.. రీల్స్ చేసేటప్పుడు రిస్కీ రీల్స్ విషయాలను పక్కన పెట్టాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!