అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి చేరుకొన్నారు. అమెరికాకు చెందిన పలువురు ర్యాపర్లు సైతం స్టేజిపై కాలు కదపడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ప్రోగ్రాం స్టార్ట్ అవనున్న క్రమంలో డ్రాకియో అదే ఈవెంట్ తాలూకూ మెయిన్ స్టేజ్ వెనకాల హత్యకు గురయ్యాడు. ఎవరో కొంతమంది దుండగులు అతనిని కత్తితో పొడిచి పరారయ్యారు. వెంటనే ర్యాపర్ ని అక్కడఉన్నవారు హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ ప్రోగ్రాంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.