Lava Storm 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తమ తాజా 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు స్టోర్మ్ లైట్ 5G (Storm Lite 5G), స్టోర్మ్ ప్లే 5G (Storm Play 5G) ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరల్లో వస్తున్న ఈ ఫోన్లు మార్కెట్లోకి తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో రావడం విశేషం. మరి ఈ మొబైల్స్ ఫీచర్స్ ను చూసినట్లైతే.. ఈ రెండు ఫోన్లలోనూ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం గమనార్హం. వేగవంతమైన స్క్రీన్ అనుభవాన్ని యూజర్లకు అందించేందుకు ఇది సహకరిస్తుంది. వీటికి IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Read Also: Air India flight crash: కొత్త ఇళ్లు, భారత్‌లో కొత్త జీవితం.. కేరళ నర్సు కలల్ని చెరిపిన విమాన ప్రమాదం..

ఇక స్టోర్మ్ లైట్ 5G మోడల్‌లో మొట్టమొదటిసారి MediaTek Dimensity 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4GB LPDDR4x RAM, 64GB/128GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే స్టోర్మ్ ప్లే 5G మోడల్‌లో అధునాతనమైన MediaTek Dimensity 7060 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది UFS 3.1 స్టోరేజ్ కలిగిన మొదటి బడ్జెట్ ఫోన్.
Read Also: Plane Crash: విమాన శిథిలాల్లో డీవీఆర్ బాక్స్ లభ్యం.. ఆ రహస్యం బయట పడుతుంది?

ఇక కెమెరా ఫీచర్లు చూస్తే.. రెండు ఫోన్లలోనూ 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరా ఉంటుంది. స్టోర్మ్ ప్లే మోడల్‌కు అదనంగా 2MP సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించబడింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లు Android 15తో వస్తాయి. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, బాటమ్-పోర్టెడ్ స్పీకర్, USB Type-C పోర్ట్, 5G, Wi-Fi 802.11 ac, Bluetooth 5.3, GPS + GLONASS వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ రెండు ఫోన్లలోనూ 5000mAh బ్యాటరీ ఉంది. స్టోర్మ్ లైట్ కు 15W ఛార్జింగ్, స్టోర్మ్ ప్లేకి 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

లావా స్టోర్మ్ లైట్ 5G Astral Blue, Cosmic Titanium రెండు రంగుల్లో లభిస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.7,999 మాత్రమేగా కంపెనీ ప్రకటించింది. ఇది జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే లావా స్ట్రోమ్ ప్లే 5G ధర రూ.9,999గా నిర్ణయించారు. ఇది 6GB + 128GB వేరియంట్‌గా లభిస్తుంది. జూన్ 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.