పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..!
పంజాబ్ జలంధర్ లో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని బలవంతంగా కార్లోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని రేప్ చేశారు ఆ యువతులు.. అనంతరం అతడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఓ పోలీస్ అధికారి షాకయ్యాడు. అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు. అమ్మాయిలపై మాత్రమే రేపు జరుగుతుందని అనుకున్నా.. కానీ పరుషులపై కూడా గ్యాంగ్ రేప్ జరుగుతుందా? అంటూ జరిగిన విషయాన్ని వివరించాడు. అయితే ఈ వార్త వైరల్ కావడంతో .. పురుషులకు అన్యాయం జరిగితే.. ఎవరు స్పందించరు.. అదే మహిళకు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటారంటూ తమ అభిప్రాయాన్ని కామెంట్లలో పెడుతున్నారు. అయితే ఈ విషయం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.