విశాఖలో జ్యోతిష్యుడు మృతి కేసును ఛేదించారు పోలీసులు.. బీమిలి బీచ్ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె అవశేషం కనిపించాయి. అస్థిపంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు, 50 ఏళ్ల మోతి అప్పన్నదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు. గుర్తు తెలియని వ్యక్తి మోతి అప్పన్నను ఇక్కడకు తీసుకొచ్చి చంపేసిన…