కల్తీరాయుళ్లు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు కల్తీ చేస్తున్న కేటుగాళ్లను అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా కల్తీ రాయుళ్లు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రభుత్వం దీనిపై ఎన్ని ఆంక్షలు విధించిన కల్తీ రాయుళ్లు తమ పనిని ఏదేచ్చగా కొనసాగిస్తునే ఉన్నారు. చివరకు ప్రభుత్వం అమ్మే విజయ నెయ్యిని సైతం కల్తీ చేయడానికి ప్రయత్నించారు కల్తీకేటుగాళ్లు.
Read Also: ధర్మయుద్ధంలో బీజేపీ గెలిచింది: లక్ష్మణ్
ఈ ఘటన హైదరాబాద్ నగరంలో షాహినాయత్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఆకస్మిక దాడులు నిర్వహించగా కల్తీ నెయ్యి బాగోతం బట్టబయలైంది. షాహినాయత్ గంజ్‌లో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దీపక్, రాహుల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల రూపాయల విలువచేసే 970 లీటర్ల నకిలీ కల్తీ నెయ్యితో పాటు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. విచారణ నిమిత్తం నిందితులను షాహినాయత్‌గంజ్ పోలీసులకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.