Anil Kumar Yadav Fires On Nara Lokesh And TDP Leaders In Press Meet: తనకు భయమనేదే లేదని, చర్చలకే కాదు యుద్ధానికైనా వస్తానని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారు. నెల్లూరు సిటీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో వ్యాపారుల నుంచి ఎవరు డబ్బులు వసూలు చేశారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ సమావేశంలో వేదికపై ఉన్న నేతలే అక్రమాలు చేశారని ఆరోపించారు. వైసీపీ నుంచి టిడిపిలో చేరుగానే.. వారు పునీతులయ్యారా? అని ప్రశ్నించారు. పెన్నా బ్యారేజ్ తానే పూర్తి చేశానని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనతో పోటీ చేయాలని సవాల్ విసిరానని, తాను ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని కూడా స్పష్టం చేశానని, అయినా స్పందించడం లేదని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి, తన పేరు స్మరిస్తున్నారని కౌంటర్ వేశారు. తన దెబ్బకు భయపడే.. నారాయణని నెల్లూరు ఇంచార్జ్‌గా రాత్రికి రాత్రే ప్రకటించారని అన్నారు.
Shehnaaz Kaur Gill: ప్రేమ పేరుతో నన్ను మోసం చేశారు.. బాలీవుడ్ బ్యూటీ ఆవేదన
తాను నారా లోకేష్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని.. ఏ సమయమిచ్చినా, అరగంటలో అక్కడికి వచ్చేస్తానని అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే రావాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మారుస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే గంజాయి కేసుల్లో టీడీపీ నేతలే ఎక్కువగా అరెస్ట్ అవుతున్నారని చెప్పారు. తన మీద సిట్‌తో పాటు సీబీఐ విచారణ వేసుకున్నా తాను సిద్ధమేనన్నారు. తనని ఓడించే సత్తా, శక్తి ఉంటే.. తనపై పోటీకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో బెట్టింగ్ కేసులు పెట్టారని, కానీ తనపై కేసులు పెట్టలేదని, కేసులో ఉన్న శాసనసభ్యుడు ఎక్కడున్నాడో, ఏ పార్టీలో ఉన్నాడో చూసుకోవాలన్నారు. లోకేష్ పక్కనున్న ఎమ్మెల్యే అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్ వల్లే తాను రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యానన్నారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని, తనని ఏమైనా అనడానికి ఒక్క జగన్‌కి మాత్రమే హక్కు ఉందని, కానీ ఆయన తనని ఎప్పుడూ ఏమీ అనలేదని చెప్పుకొచ్చారు.
Anu Gowda: నటి అనుగౌడపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టారు