Site icon NTV Telugu

Tragedy : నమ్మి వెళ్తే నరికేశారు.. పరకాల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.!

Crime

Crime

పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (మెకానిక్), లావణ్య (మున్సిపల్ కార్మికురాలు) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సుఖంగా సాగిపోతున్న వీరి సంసారంలోకి వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. లావణ్యకు స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త సుమన్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య, అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గోవిందరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో రూ. 5 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది.

Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..

గతంలో రెండుసార్లు సుమన్‌ను చంపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఈసారి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది. ఈ నెల 3వ తేదీన దంపతులిద్దరూ వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు (ఏప్రిల్ 4) నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు. లావణ్య తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ సుమన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బాధితుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు, సుమన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా గోవిందరావుపేట శివారులో సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించి అక్కడ గాలించగా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న సుమన్ మృతదేహం లభ్యమైంది.

Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..

సుమన్‌ను వరంగల్ నుండి గోవిందరావుపేట శివారుకు తీసుకెళ్లిన నిందితులు, అక్కడ అతడికి మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసుల విచారణలో లావణ్య తన నేరాన్ని అంగీకరించడంతో, ఆమెతో పాటు సుపారీ తీసుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version