Delhi Incident: ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై బాయ్ ఫ్రెండ్ దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ ఘటన నిన్న ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ఏరియాలోని రోహిణిలో జరిగింది. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాలికపై కత్తితో 21 సార్లు పొడిచాడు. కత్తి తలలో ఇరుక్కుపోయినా ఆగకుండా బండరాయితో మోదీ దాడి చేశారు. అటుగా వెళ్తున్న జనాలు చూసినా కూడా ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమెను ఐదుసార్లు బండరాయితో కొట్టాడు. 20 ఏళ్ల సాహిల్ ను నిందితుడిగా గుర్తించారు. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఒక రోజు ముందు ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం.
Read Also: Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
చనిపోయిన బాధితురాలని నిక్కీగా గుర్తించారు. నిక్కీ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని నిందితుడు తొలిగించాడు. నిక్కీ తన స్నేహితుడి కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తుండగా.. సాహిల్ ఆమెను ఆపేసి పలుమార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించినట్లు త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి.
ఈ హత్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గర్నవర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఢిల్లీలో ఓ మైనర్ బాలికను బహిరంగంగా దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం మరియు దురదృష్టకరం. నేరస్తులు నిర్భయగా మారారు. పోలీసులంటే భయం లేదు. L-G సార్, లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత. ఏదో ఒకటి చేయి. ఢిల్లీ ప్రజల భద్రత చాలా ముఖ్యమైనది’’ అని అన్నారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మలివాల్ అన్నారు. షహబాద్ లోని బాధితురాలి ఇంటి ఆవరణలోనే దారుణంగా హత్యకు గురైందని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “16 ఏళ్ల అమ్మాయిని 40-50 సార్లు కత్తితో పొడిచారు, ఆపై చాలాసార్లు రాయితో కొట్టారు, ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. చాలా మంది దీనిని చూసినా పట్టించుకోలేదు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయింది. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ఎల్‌జీ, డీసీడబ్ల్యూ చీఫ్ మరియు ఢిల్లీ సీఎంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.