Viral: ఉత్తర భారతదేశంలో రెండు రోజుల నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ బలమైన గాలుల వల్ల ఇళ్లు, దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో పెను తుపాను ధాటికి సెల్ టవర్ నేలమట్టం చేసింది. నాగౌర్ జిల్లాలో తీవ్ర తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే ఇంత భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయని ఎవరూ ఊహించలేదు. ఈ బలమైన గాలి వల్ల బద్లీ రోడ్డులోని రియాసీ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఒక్క సారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read Also:Rajastan: పెళ్లి రోజే వధువు జంప్..13రోజులు పెళ్లి బట్టల్లో మండపంలోనే ఎదురుచూసిన వరుడు
మొబైల్ టవర్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చింది. అనంతరం పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ మొబైల్ టవర్ నేలకూలడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే ఇతర ఆస్తులకు నష్టం వాటిళ్లలేదు. టవర్ నేల కూలిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ బలమైన ఈదురుగాలుల ప్రభావం మధ్యప్రదేశ్ లోనూ కనిపించింది. ఆ రాష్ట్రంలోని ఉజ్జయిని పాటు పలు నగరాల్లో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఆయా ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాల్ లోక్ ఆలయ కారిడార్ లో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అదే నగరంలో చెట్టు కూలి ఒకరు, నాగాడలో కచ్చా ఇంటి గోడ కూలి మరొకరు మరణించారు. ఇదే జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారు.
Read Also:Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు నాయకుడు కాదు మానిప్యులేటర్.. సజ్జల సీరియస్ కామెంట్స్
Mobile Tower fell down in Nagaur (Rajasthan) due to damaging winds pic.twitter.com/gAHUBTeE8Z
— Weatherman Shubham (@shubhamtorres09) May 28, 2023