గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిని ప్రియురాలు పదునైన కత్తితో పొడిచింది. దీంతో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీకాం చదువుతున్న ధీరజ్ (21), ప్రియ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ముందు ప్రియురాలు ప్రతిపాదన పెట్టింది. అందుకు ప్రియుడు ధీరజ్ నిరాకరించాడు. దీంతో ఆమె పగ పెంచుకుంది. ధీరజ్‌ను చంపేయాలని కుట్ర పన్నింది. ఇందులో భాగంగా డిసెంబర్ 24న తనను కలవాలంటూ ధీరజ్‌కు ప్రియ ఫోన్ చేసింది. ప్రియురాలి కుట్ర తెలియని ధీరజ్.. ప్రియురాలిని కలుసుకున్నాడు. అతడితో బాగా మద్యం సేవించేలా చేసింది. మత్తులోకి జారుకున్నాక.. మరో ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి పదునైన ఆయుధంతో దాడి చేసింది. కారులో అపస్మారక స్థితిలో ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని యథార్త్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి: Gandhi Tatha Chettu: జనవరి 24న సుకుమార్ కూతురు ‘గాంధీ తాత చెట్టు’ రిలీజ్
తన కుమారుడిని ప్రియా అనే యువతి చంపే ప్రయత్నం చేసిందని మంగళవారం ధీరజ్ తండ్రి హన్సరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రియ పరిచయం అయిందని తెలిపాడు. కారులో ప్రియాతో ధీరజ్ ఉన్నప్పుడు అతడితో మద్యం తాగేలా చేసిందని.. అనంతరం స్నేహితురాళ్లతో కలిసి హత్యాయత్నం చేసిందని ఫిర్యాదులో హన్సరాజ్ పేర్కొన్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో ప్రియాతో పాటు ఆమె గుర్తుతెలియని స్నేహితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రబుపురా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Anasuya: భర్త ముందే కైపెక్కించే అందాలతో బీచ్ ఒడ్డున కవ్విస్తున్న అనసూయ