Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Murder: వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కొనసాగించవద్దని చెప్పినందుకు నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి బలయ్యాడు. సహజీవనం చేస్తున్న మహిళతోపాటు.. ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేశారు. నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించిన సైదాపురం హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ధ్రువీకరించారు. సైదాపురం మండలం ఆదురుపల్లి గ్రామ సమీపంలో ఉన్న నిమ్మ తోటలో ముగ్గురు గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటూ నిమ్మ తోటకు కాపలా ఉండేవారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంతో లక్ష్మమ్మ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె అక్కడే నివాసం ఉంటున్న మస్తానయ్యతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఆమెతో గొడవ పడేవాడు.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్‌కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
మస్తానయ్యతో సంబంధాన్ని కొనసాగించొద్దంటూ పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో మస్తానయ్యతో కూడా గొడవ పడడంతో.. అతను సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. కర్రతో తల పైన బలంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లక్ష్మమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మ కలిసి ఈ హత్య చేశారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక నిమ్మ తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనివాసులు జోక్యం చేసుకుని మృతదేహానికి కాళ్లు చేతులు కట్టి.. గోనె సంచిలో పెట్టారు. ఆ గోనె సంచికి పెద్ద బండరాయి కట్టి సమీపంలో ఉండే చెరువులో పడేశారు.
దాదాపు వారం పాటు మృతదేహం చెరువులోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం చెల్లి మౌనికకు అనుమానం వచ్చి తన అన్న కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో చెరువులో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలో దిగిన పోలీసులు కేసుని ఛేదించారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మస్తానయ్య, మరో వ్యక్తి బాణాల మస్తానయ్య, లక్ష్మమ్మతో పాటు.. మృతదేహాన్ని బయటపడేసేందుకు సహకరించిన శ్రీనివాసులుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మొత్తంగా వివాహేతర బంధం.. ఆ తర్వాత జరిగిన గొడవల ద్వారా సుబ్రహ్మణ్యం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!