Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
- ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల
- 14 అంగుళాల Full HD+ డిస్ప్లే
- మీటింగ్‌లు, ప్రజెంటేషన్లు, కార్యాలయ పనులకు అనుకూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంప్యూటర్ హార్డ్‌వేర్ దిగ్గజం Acer భారత మార్కెట్లో తన కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్ ‘Acer TravelLite TL24-54M’ను విడుదల చేసింది. Intel కొత్త Core Series 3 ప్రాసెసర్‌తో వచ్చిన తొలి కమర్షియల్ ల్యాప్‌టాప్‌గా ఇది నిలిచింది. 64GB వరకు DDR5 RAM, PCIe Gen4 SSD, AI ఫీచర్లు, తేలికైన అల్యూమినియం డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఈ ల్యాప్‌టాప్ ఎంటర్‌ప్రైజ్‌లు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్ దేశవ్యాప్తంగా Acer కమర్షియల్ పార్ట్నర్ నెట్వర్క్ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే, ప్రస్తుతం కంపెనీ దీని అధికారిక ధరను వెల్లడించలేదు.
డిస్ప్లే
Acer TravelLite TL24-54Mలో 14 అంగుళాల Full HD+ డిస్ప్లేను అందించారు. సన్నని బెజెల్స్‌తో వచ్చే ఈ స్క్రీన్ 180-డిగ్రీల హింజ్‌ను కలిగి ఉండటంతో డిస్ప్లేను పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇది మీటింగ్‌లు, ప్రజెంటేషన్లు, కార్యాలయ పనులకు అనుకూలంగా ఉంటుంది.
Also Read
- Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
- Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
Intel Core Series 3 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరు
ఈ ల్యాప్‌టాప్‌లో Intel Core Series 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ, వేగవంతమైన పనితీరు, బిజినెస్ వర్క్‌లోడ్‌లను సమర్థవంతంగా నిర్వహించేలా ఈ కొత్త ప్రాసెసర్ రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ల్యాప్‌టాప్‌లో గరిష్టంగా 64GB DDR5 RAMను కాన్ఫిగర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే PCIe Gen4 SSD స్టోరేజ్ సపోర్ట్ ఉండటంతో వేగవంతమైన డేటా యాక్సెస్, బూట్ టైమ్ లభిస్తుంది.
భద్రత, AI ఫీచర్లు
Acer TravelLite TL24-54Mలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
TPM 2.0 సెక్యూరిటీ సపోర్ట్
ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్
కెన్సింగ్టన్ లాక్ స్లాట్
ప్రైవసీ షట్టర్‌తో కూడిన వెబ్‌క్యామ్
AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు
ఈ ఫీచర్లు డేటా భద్రతను మెరుగుపరచడంతో పాటు బిజినెస్ వినియోగదారులకు అదనపు రక్షణను అందిస్తాయి.
కనెక్టివిటీ
ఈ బిజినెస్ ల్యాప్‌టాప్‌లో పలు ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Gigabit Ethernet
Wi-Fi
DisplayPort సపోర్ట్‌తో USB Type-C పోర్ట్
HDMI పోర్ట్
బ్యాటరీ, డిజైన్
ల్యాప్‌టాప్‌లో Acer FlexiCharger టెక్నాలజీని అందించారు. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అల్యూమినియం ఛాసిస్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.22 కిలోగ్రాములు మాత్రమే ఉండటంతో ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు.
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?