Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unused Apps: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్లోడ్ చేయడం, వాటిని వాడటం మనకు అలవాటు. అయితే, నెలల తరబడి ఓపెన్ కూడా చేయకుండా ఫోన్లో అలాగే ఉంచేసిన యాప్‌ల వల్ల మీ ప్రైవసీతో పాటు ఫోన్ సెక్యూరిటీ సైతం ప్రమాదంలో పడుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఏదో ఒకరోజు అవసరం వచ్చి డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత మర్చిపోయిన యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి మీ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్, ఫొటోల వంటి కీలకమైన పర్మిషన్లను కలిగి ఉంటాయి. భవిష్యత్తులో ఆ యాప్‌లలో ఏవైనా సెక్యూరిటీ లోపాలు తలెత్తినా లేదా వాటి డేటా లీక్ అయినా.. మీ వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఈ అన్యూజ్డ్ యాప్‌ల వల్ల కేవలం డేటా చోరీ మాత్రమే కాదు, మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటుంది. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటర్నెట్ను వాడుకుంటూ, నోటిఫికేషన్లు పంపుతూ, అప్డేట్లను డౌన్లోడ్ చేసుకుంటాయి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడమే కాకుండా, మొబైల్ డేటా వృథా అవుతుంది. ఫోన్ కూడా స్లో అయిపోతుంది. పైగా, మీరు యాప్‌ను ఓపెన్ చేయకపోయినా.. పర్మిషన్లు ఉండటం వల్ల అవి మీ లొకేషన్, అలవాట్లకు సంబంధించిన డేటాను నిరంతరం సేకరిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా, ప్రస్తుత కాలంలో ఒక్కో యాప్ వందల ఎంబీల నుంచి జీబీల వరకు స్టోరేజ్‌ను ఆక్రమిస్తుండటం వల్ల ఫోన్ మెమరీ సైతం త్వరగా నిండిపోతుంది. వీటిని తొలగించడం ద్వారా కొత్త ఫొటోలు, వీడియోల కోసం ఫోన్లో స్పేస్ దొరుకుతుంది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా యాప్ మళ్లీ అవసరం అవుతుందని మీరు భావిస్తే, ఐఫోన్లో ఆఫ్‌లోడ్ యాప్ (Offload App), ఆండ్రాయిడ్‌లో యాప్ ఆర్కైవింగ్ (App Archiving) వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు. దీనివల్ల యాప్ డిలీట్ అయినా, అందులోని మీ ముఖ్యమైన డేటా మాత్రం భద్రంగా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ సులువుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకే, ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మీ ఫోన్లోని యాప్‌ల లిస్ట్‌ను చెక్ చేసుకుని, అనవసరమైన వాటిని తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం యాప్‌ను డిలీట్ చేస్తే సరిపోదు. ముందుగా యాప్‌లోకి వెళ్లి లాగ్అవుట్ అవ్వాలి. ఒకవేళ ఆ యాప్ ఇక ఎప్పటికీ అవసరం లేదు అనుకుంటే మీ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ (Close) చేయాలి. అప్పుడే కంపెనీ సర్వర్లలో మీ డేటా నిల్వ ఉండకుండా మీ ప్రైవసీ మరింత పటిష్టంగా ఉంటుంది.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!