Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
- ముంబైలో దారుణం
- సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతుంటే.. ఇంకోవైపు అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో చోటు… ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు తెరదీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో మరో ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు.
ఇది కూడా చదవండి: Ministry of Health: 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. లిస్ట్ ఇదే.. చెక్ చేసుకోండి?
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికకు ఓ హోటల్‌లో పని చేసే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. మాట్లాడాలంటూ ఇంట్లో నుంచి పిలవడంతో బాలిక బయటకు వెళ్లింది. అదే అదునుగా ఆమెపై అత్యాచారం చేశాడు. తన ఊరుకు తీసుకెళ్తానంటూ నమ్మించి గుజరాత్ తీసుకెళ్లి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అమ్మాయి కనిపించడం లేదని ఎంత వెతికినా కనిపించలేదు. ఇటీవల బాలిక ఇంటికి వచ్చింది. మౌనంగా ఉండడంతో జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న నిందితుడి ఫొటోను పోలీసులకు అందజేశారు. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు 21 ఏళ్ల యువకుడిపై వకోలా పోలీస్ స్టేషన్ లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద కేసు నమోదు చేశారు. గోరేగావ్ నుంచి నిందితుడ్ని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
నిందితుడు… బాధితురాలిని అంధేరిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆగస్టు 15న ఆమెను ఓ గ్రామానికి తీసుకెళ్తానని చెప్పి గుజరాత్ తీసుకెళ్లాడన్నారు. నిందితుడు గుజరాత్‌లో తనపై మరో మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!