Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Root Breaks Sachin Tendulkar Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు.
జో రూట్ 521 ఇన్నింగ్స్‌లలో 23 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను 522 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. ఈ జాబితాలో భారత స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌లలోనే 23 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
- Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
జో రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ 23 వేల అంతర్జాతీయ పరుగులు చేశారు. రూట్ ఇప్పటికే టెస్టు క్రికెట్లో టెండూల్కర్‌కు సంబంధించిన పలు రికార్డులను అధిగమించాడు. ఇటీవల టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో కీలక రికార్డుపైనే ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ రికార్డును కూడా రూట్ అధిగమిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సచిన్ 15,921 టెస్టు పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రూట్ 14,278 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 1,643 పరుగుల తేడా ఉంది.
ఈ ఏడాది డిసెంబర్లో 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్న జో రూట్.. ఇప్పటికీ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్టుల్లో సచిన్ 200 మ్యాచ్‌లు ఆడగా.. రూట్ ప్రస్తుతం ఆ రికార్డుకు 31 టెస్టుల దూరంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో రూట్ అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. వన్డేల్లో అతడి ప్రదర్శన కూడా అసాధారణంగానే ఉంది. వాస్తవానికి రూట్ ప్రస్తుతం టెస్టుల కంటే వన్డేల్లో మెరుగైన బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేకు ముందు రూట్ 7,826 వన్డే పరుగులు సాధించాడు. 51కిపైగా సగటుతో పాటు 20 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!