ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతుంటే.. ఇంకోవైపు అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో చోటు... ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 ఏళ్ల మైనర్ బాలికను సాయిబ్‌రావు అనే 45 ఏళ్ల వ్యక్తికి బాల్య వివాహం చేశారు. అయితే సాయిబ్‌రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.