Digital Arrest: 26 ఏళ్ల యువతి “డిజిటల్ అరెస్ట్”.. వీడియో కాల్‌లో బట్టలు విప్పాల్సి వచ్చింది..
- ‘డిజిటల్ అరెస్ట్’కి గురైన 26 ఏళ్ల యువతి..
- పోలీసుల్లా ఫోన్ చేసిన స్కామర్లు..
- బట్టలు విప్పేలా బలవంతం..
- ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ముంబైలో 26 ఏళ్ల మహిళ ఇలా ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. వీడియో కాల్ సమయంలో బట్టలు బలవంతంగా విప్పేలా చేశారు. పోలీసుల అధికారులుగా నటిస్తూ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో రూ.1.78 లక్షలు మోసం చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 19-20 మధ్య జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి అయిన మహిళకు ఢిల్లీ పోలీసులమని చెప్పుకునే వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. వ్యాపారవేత్త నరేష్ గోయల్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో యువతికి ప్రమేయం ఉందని బెదిరించారు.
Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్‌లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
Read Also: Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?
స్కామర్లు అనేక నంబర్లు ఉపయోగించి, ఆమెని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వర్చువల్ ఇంటరాగేషన్ కోసం ఒక గదిని బుక్ చేయమని బలవంతం చేశారు.వీడియో కాల్ సమయంలో నిందితులు బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ కోసం రూ. 1.78 లక్షలు బదిలీ చేయమని మహిళని మోసగించారు. ఆ తర్వాత ‘‘బాడీ వెరిఫికేషన్’’ కోసం డిమాండ్ చేస్తూ, ఆమెని బట్టలు విప్పమని బలవంతం చేశారు.
బాధితురాలు నవంబర్ 28న సంఘటనపై ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు మరియు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దోపిడీ మరియు వేధింపుల కేసు నమోదు చేయబడింది. మొదట దహిసర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును అంధేరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం అనుమానితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?