Love jihad: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ‘‘లవ్ జిహాద్’’ ఘటన వెలుగులోకి వచ్చింది. రత్లాంలో ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా నటిస్తూ ఒక మహిళ సంసారాన్ని నాశనం చేశాడు. వివాహిత అయిన మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేలా ఒప్పించి, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసిన వ్యక్తి, చివరకు మహిళను వదిలేశాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. చివరకు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రత్లాంలోని ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఇమ్రాన్ అనే వ్యక్తి హిందువుగా నటిస్తూ, ‘‘సోనూ’’ అనే పేరుతో వివాహితను ట్రాప్ చేశాడు. భర్తను విడిచిపెట్టాలని, విడాకులు ఇవ్వాలని, ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చాడు. చివరకు, మహిళ ఇమ్రాన్ మాయలో పడి సొంత భర్తకు విడాకులు ఇచ్చింది. విడాకుల పిటిషన్ తర్వాత మహిళ, ఇమ్రాన్‌తో కలిసి ఉంది. జూలై 2023లో భర్తను విడిచిపెట్టింది.
Read Also: LeT leader: “భారత్ మా ఉగ్రస్థావరాలను నాశనం చేసింది”.. సిందూర్ దాడులను ఒప్పుకున్న లష్కరే తోయిబా..
30 ఏళ్ల మహిళ ఇమ్రాన్‌ను 2020లో రామ్ మందిర్ ప్రాంతంలో కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో నిందితుడు హిందువుగా పరిచయమైనట్లు చెప్పింది. జూన్ 2023లో ఫోన్ ద్వారా మళ్లీ నిందితుడితో రిలేషన్ పెంచుకుంది. నిందితుడు తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, తన భర్తకు విడాకులు ఇచ్చేలా చేశారని, అతడి మాటలు విని జూలై 2023లో తన భర్తను విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, ఇమ్రాన్‌తో కలిసి నివసిస్తున్నప్పుడు, అతను ఇతరులతో మాట్లాడే సమయంలో హిందువు కాదని బాధితురాలికి తెలిసింది. నవంబర్ 8, 2024న ఆమెకు భర్తతో విడాకులు ఖరారయ్యాయి. దీని తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఇమ్రాన్‌ను మహిళ కోరింది. దీనికి అతను నిరాకరించాడు. దీనివల్ల ఇద్దరి మధ్య డిసెంబర్ 26, 2025లో గొడవ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని నిందితుడు బెదిరించాడు. దీంతో మహిళ డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనను వివిధ ప్రాంతాల్లో భార్యగా పరిచయం చేశాడని, తనతో చాలా సార్లు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని కేసు పెట్టింది. పోలీసులు పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు.