Love jihad: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ‘‘లవ్ జిహాద్’’ ఘటన వెలుగులోకి వచ్చింది. రత్లాంలో ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా నటిస్తూ ఒక మహిళ సంసారాన్ని నాశనం చేశాడు. వివాహిత అయిన మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేలా ఒప్పించి, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసిన వ్యక్తి, చివరకు మహిళను వదిలేశాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. చివరకు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. తాను హిందువు అని చెప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతం, నిజస్వరూపం గురించి తెలుసుకుంది. ఈ విషయం బయటకు చెబితే.. ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
Love jihad case: ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రం లవ్ జిహాద్ తో అట్టుడుకుతోంది. పురోలాలో కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడు మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే అదే రాష్ట్రంలో డబుల్ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ముస్లిం అన్నతమ్ములు వారిని తమను తాము హిందువులుగా పరిచయం చేసుకుని, హిందూ పేర్లను ఉపయోగించి ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Facebook Love: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందువుగా నటిస్తూ సోషల్ మీడియాలో యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత శీతల పానీయంలో గుంజి మందు(మత్తుమందు) వేసి చిత్రహింసలకు గురిచేశారు.