Bihar: దారుణం.. బతికుండగానే బాలికను పాతిపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూతురు అంటే లక్ష్మీ దేవితో సమానం. ఆడపిల్ల పుట్టిందంటే, తమ ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ చాలామంది సంబరాలు చేసుకుంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతారు. ముఖ్యంగా.. తల్లి అయితే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇక నానమ్మ కూడా తల్లిలాగే ప్రేమను పంచుతూ.. గారాబం చేస్తుంది. కానీ.. ఇక్కడ ఓ బాలిక పాలిట మాత్రం తల్లి, నానమ్మలు రాక్షసులయ్యారు. బతికుండగానే శ్మశానంలో వాళ్లు ఆ బాలికను పాతిపెట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
బీహార్‌లోని సారన్‌లో మర్హా నది ఒడ్డిన ఉన్న శ్మశాన వాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టారు. అయితే.. కాసేపు తర్వాత సమాధి నుంచి బాలిక ఏడుపులు వినిపించాయి. తొలుత దెయ్యం అనుకొని స్థానికులు భయపడ్డారు. అనంతరం అనుమానం వచ్చి ఆ సమాధిని తవ్వి చూడగా.. బాలిక బతికే ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆ బాలికను విచారించగా.. తన పేరు లీలా అని చెప్పింది. అంతేకాదు.. తన తల్లి, నానమ్మలే తనను పాతి పెట్టారని చెప్పింది.
Also Read
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
- Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్‌పై నర్సు సంచలన ఆరోపణ
తన తల్లి పేరు రాజు శర్మ అని, తల్లి పేరు రేఖా దేవి అని ఆ బాలిక వెల్లడించింది. బయటకు వెళ్దామని తన తల్లి, నానమ్మ తనతో అన్నారని.. అనంతరం శ్మశానం వద్దకు తీసుకెళ్లి, నోటిలో మట్టి కుట్టి, పాతిపెట్టి వెళ్లిపోయారని తెలిపింది. ఆ బాలిక మాటలు విని పోలీసులు సహా స్థానికుల మనసు తరుక్కుపోయింది. సజీవంగానే ఆ పాపను పాతిపెట్టాలని ఆ తల్లి, నానమ్మకి మనసెలా వచ్చిందంటూ శాపనార్ధాలు పెట్టడం మొదలుపెట్టారు. అయితే.. ఆ బాలిక తన ఊరు పేరు మాత్రం చెప్పలేకపోయింది. ఆ బాలిక కుటుంబ సభ్యుల్ని పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Korean Kanakraju: నైజాం, వైజాగ్ రైట్స్ కొన్న దిల్ రాజు
-
Railways Ticket Cancellation Rules: టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత కట్..? కొత్త వివరాలు వెల్లడించిన రైల్వే మంత్రి
-
Ram Charan : రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
-
CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!