ముస్లింల భద్రతపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ పాడ్‌కాస్ట్‌లో “మీ రాష్ట్రంలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారా?” అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని అన్నారు. హిందువులు సురక్షితంగా ఉంటే.. ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పారు.100 ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో ఒక్క హిందు కుటుంబం, లేదా 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా? అని సీఎం యోగి ప్రశ్నించారు. కానీ 100 హిందూ ఇళ్లు ఉన్న ఏరియాలో ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. చరిత్రలో ఏ హిందూ రాజు కూడా ఏ దేశాన్ని ఆక్రమించిన ఉదాహరణ లేదని తెలిపారు.
READ MORE: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
సంభాల్ వద్ద జరిగిన తవ్వకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. చుట్టు పక్కల ఉన్న అన్ని దేవాలయాను తవ్వి వెలికి తీస్తామన్నారు. స్థానిక పరిపాలన ఇప్పటివరకు 54 మతపరమైన ప్రదేశాలను గుర్తించిందని.. మరికొన్నింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈద్గా మసీదు-కృష్ణ జన్మభూమి వివాదంపై సీఎం స్పందించారు. మధురకు సంబంధించి కోర్టు ఆదేశాన్ని మాత్రమే తాము అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. లేకుంటే ఈపాటికి అక్కడ చాలా విధ్వంసం జరిగి ఉండేదన్నారు. వక్ఫ్ బోర్డును కూడా తీవ్రంగా విమర్శించారు. సంభాల్ నుంచి మధుర వరకు ఉన్న అంశాలపై సీఎం యోగి సమాధానమిచ్చారు. బుల్డోజర్ చర్యను మరోసారి ఆయన సమర్తించారు.
READ MORE: BRS MLCs Protest: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..