Allagadda: ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. మహిళ కిడ్నాప్‌నకు యత్నం..
- ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల వీరంగం..
- హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం..
- అడ్డుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హేమలత భర్త మాధవరెడ్డి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా.. అప్పటినుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.. పెళ్లి చేసుకోవాలనే కొంతకాలం ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో కలిసి హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా.. ఆమె కుటుంబీకులు, స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటిముందు వీరంగం సృష్టించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్, మరో 7 మందిపై కేసు నమోదు చేశారు.
Read Also: Andhra Pradesh: పర్యావరణ దినోత్సవం.. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!