Chain Snatching: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు.. టెక్నీషియన్ అని నమ్మించి ఇంట్లోకి దూరి ఘాతుకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain Snatching: చైన్ స్నాచింగ్.. అనగానే మనం ఊహించుకునేది ఒక బైక్.. ఆ బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు.. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఎటాక్.. చైన్ లాక్కుని రయ్‌మని దూసుకెళ్లడం .. ఇదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా చైన్ స్నాచింగ్‌లో ఇదే అత్యంత ప్రాచుర్యమైన స్టైల్. మరో రకం దొంగతనం కూడా ఉంటుంది. షాపుల్లోకి చొరబడి మహిళల మెడల్లో చైన్ లాక్కుని క్షణాల్లో పారిపోవడం చూస్తూ ఉంటాం. కానీ హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు. ఇన్నాళ్లూ బైక్ మీద రావడం.. లేదా షాపుల్లోకి చొరబడి మహిళల మెడలో గొలుసులు లాక్కుని పరారయ్యే వాళ్లు. ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే చొరబడుతున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీలు జల్లెడ పడుతున్నారు.
READ ALSO: Nellore Prostitution: హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!
Also Read
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
మియాపూర్ ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. తాను ఇంటర్నెట్ టెక్నీషియన్ అని, మీ ఇంట్లో నెట్‌వర్క్ సమస్య ఉందని, దాన్ని సరిచేయడానికి వచ్చానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి అతడిని ఇంట్లోకి అనుమతించింది. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే చైన్ స్నాచర్ వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మిని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె కళ్లలోకి కొట్టాడు. లక్ష్మి కళ్ల మంటతో విలవిల్లాడుతూ కిందపడిపోయింది. ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు దుండగుడు. తేరుకుని చూస్తే మహిళ మెడలో గొలుసు లేదు. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు ఏ మార్గంలో వెళ్లాడనేది గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
READ ALSO: Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు.. 10 నెలల తర్వాత ఇలా..
తాజావార్తలు
-
Yash Dayal-RCB: ఆర్సీబీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో.. చాలా బాధగా ఉంది.. యశ్ దయాల్ సంచలన వ్యాఖ్యలు!
-
Chennai Love Story: ఎంఎం కీరవాణి చేతుల మీదుగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి ‘వదలనే..’ పాట విడుదల
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
-
IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్‌లో హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!
-
Arshdeep Singh: భారీ షాకిచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా డిలీట్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!