Nellore Prostitution: హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Prostitution: అందమైన అమ్మాయిలు కావాలంటే మా గ్రూప్‌లో జాయిన్ అవ్వమని టెలిగ్రామ్.. ఇన్‌స్టాలో నోటిఫికేషన్ వస్తుంది. చేరిన వెంటనే అమ్మాయిల ఫోటోలు విత్ రేట్ పెడతారు. రూమ్ బుకింగ్ కూడా మాదే అంటూ మెసేజ్ పెడతారు. ఇలా నెల్లూరులో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో విటులతోపాటు నిర్వాహకులను పట్టుకున్నారు.
ఇవాళ, రేపు స్మార్ట్ ఫోన్ చేయని పని అంటూ ఏదీ లేదు. అలాంటి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ఏకంగా హైటెక్ వ్యభిచారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతున్నారు.. కక్కుర్తి పడి మెసేజ్ చేస్తే.. వాళ్లే లాడ్జి బుక్ చేసి.. తాము చెప్పిన లాడ్జిలో ఫలానా రూమ్‌కి వెళ్లమని చెబుతారు. ఇలా నెల్లూరులోని పలు లాడ్జిలలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. బాలాజీ నగర్, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని లాడ్జిలు కేవలం వ్యభిచారం కోసమే వినియోగిస్తున్నారు. ఇటీవల టౌన్ ASP దీక్ష చేసిన దాడుల్లో సుమారు 30 మంది మహిళలు, విటులు, స్టూడెంట్స్ దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. చిన్న బజార్ పీఎస్ పరిధిలో ఒకే వ్యక్తి మూడు లాడ్జిలను మెయింటేనెన్స్‌కు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
IPL 2026: గాయాల దెబ్బకు కొత్త ప్లేయర్లు, కొత్త ఆశలు.. KKR లోకి సైనీ, GT లోకి కేజ్రోలియా..!
బయట ప్రాంతాల నుంచి యువతులను తీసుకు రావడంతో పాటు స్థానికంగా ఉండే మహిళలతో ఈ నీచపు దందా చేయిస్తున్నారు. పీఎస్‌కె గ్రాండ్ ఆర్గనైజర్ పేరుతొ నేరుగా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేశారు. ఇందులో నాలుగు లాడ్జీలుంటాయి. కొత్త అమ్మాయిలు వస్తే రేటెంతో.. అమ్మాయిల ఫొటోలతో సహా పెట్టేస్తారు. ఇలా కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ చీకటి వ్యాపారం జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆ నాలుగు లాడ్జి పరిసర ప్రాంతాలలో మఫ్టీలో కానిస్టేబుల్స్‌ను ఉంచారు. ఈ క్రమంలో రోజు ఆయా లాడ్జిలలో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అనంతరం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 30 మంది మహిళలు విటులను అరెస్టు చేశారు. నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఓ మహిళతో రూమ్‌లో ఉండటాన్ని గ్రహించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
గతంలో నెల్లూరు టౌన్ డీఎస్పీ ఆఫీస్ సమీపంలో ఓ వ్యభిచార గృహం పై పోలీసులు దాడులు చేశారు. అనంతరం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీవీనగర్.. మాగుంట లేఔట్ లోని పలు స్పా సెంటర్లో సైతం దాడులు నిర్వహించి వ్యభిచారం చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు. కానీ నిర్వాహకులను మాత్రం వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిప్పో సెంటర్ సమీపంలోని ఓ స్పా సెంటర్‌తో పాటు.. చింతా రెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో ఉండే మరో స్పా సెంటర్‌లో కూడా ఇదే తరహా వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
లాడ్జిలలో స్టేయింగ్‌కి జనాలు రాకపోవడంతో.. వాటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లీలామహల్, పొగతోట సమీపంలో ఉండే కొన్ని లాడ్జిల్లో కూడా ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. అయితే ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు తనిఖీలు చేయడంతో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం బయటపడింది. ఆయా స్టేషన్లకు నెలవారి మామూళ్లు ఇచ్చేసి.. ఈ వ్యభిచారాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం జరుగుతుందని సిటీ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఓ CI కి ఇటీవల కొందరు సమాచారం ఇచ్చినా.. ఆయన పట్టించుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. SHO లపై పిర్యాదులు వస్తూ ఉండటంతో ASP దీక్ష నేరుగా రంగంలోకి దిగి.. ఈ ముఠా ఆట కట్టించారు.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?